calender_icon.png 27 December, 2024 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భానూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ

25-12-2024 12:37:39 AM

పటాన్‌చెరు, డిసెంబర్ 24: పటాన్‌చెరు మండల పరిధిలోని బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్‌ను సంగారెడ్డి ఎస్పీ రూపే ష్ మంగళవారం తనిఖీ చేశా రు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు ఉండాలని సూచించారు. ఆల్ఫాజోలం తయారీ, గంజాయి, గుట్కా, పాన్ మసా లా, గ్యాస్ రీఫిల్లింగ్, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు తావు లేకుండా చూడాలన్నారు. సీ సీకెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ అపార్ట్‌మెంట్లు, చౌరస్తాలలో ఏర్పాటు చేసుకు నేలా చూడాలన్నారు.