ఆర్చరీ వ్యక్తిగత విభాగం
పారిస్: ఒలింపిక్స్‌లో ఆర్చరీ టీమ్ విభాగాలు నిరాశపరిచినప్పటికీ వ్యక్తిగత విభాగంలో మహిళా ఆర్చర్ భజన్ కౌర్ శుభారంభం చేసింది. మంగళవారం మహిళల ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో బరిలోకి దిగిన భజన్ కౌర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. తొలుత 1/32 రౌండ్‌లో భజన్ 7 సిఫా నురాఫిఫా (ఇండోనేషియా)ను మట్టికరిపించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఇక రెండో రౌండ్‌లోనూ జోరు ప్రదర్శించిన భజన్ 6 పోలాండ్‌కు చెందిన వియోలెటా మిస్‌జోర్‌ను చిత్తుగా ఓడించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆగస్టు 3న జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో భజన్‌కౌర్ ఇండోనేషియాకు చెందిన డియానందా చొరునిసాతో తలపడనుంది.
మరో భారత ఆర్చర్ అంకిత మాత్రం తొలి రౌండ్‌లోనే పరాజయం పాలయ్యి ఇంటిముఖం పట్టింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ముందంజ వేశాడు. 1/32 రౌండ్‌లో ధీరజ్ 7 చెక్ రిపబ్లిక్‌కు చెందిన లి ఆడమ్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకున్నాడు. వరుసగా నాలుగు సెట్లలో ధీరజ్ 29, 29, 29, 28 స్కోర్లు నమోదు చేయగా.. ప్రత్యర్థి మాత్రం చేతులెత్తేశాడు.