calender_icon.png 27 February, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగర్ సునీత కొడుకుతో..

27-02-2025 12:00:00 AM

టాలీవుడ్ స్క్రీన్‌కు ఓ కొత్త గ్లామర్ యాడ్ కాబోతోంది. ఆ కొత్తందం పేరు భైరవి. ‘సర్కార్ నౌకరి’ ఫేమ్, ప్రముఖ గాయకురాలు సునీత తనయుడు ఆకాశ్ హీరోగా తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాలో భైరవి హీరోయిన్‌గా నటించింది. తొలి చిత్రం అయినా పరిణితి చెందిన నటిగా ప్రతిభను ప్రదర్శించిందిన మేకర్స్ తెలిపారు. సెంటిమెంట్, ఎమోషనల్ వంటి సీన్లలో భైరవి యాక్టింగ్ మరో స్థాయిలో ఉండబోతున్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమా విడుదల తర్వాత భైరవిని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు. ఈ సినిమాలో ఇంకా శివవరప్రసాద్  దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో సీనియర్ నటీనటులు రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు నటించారు.

ఈ సందర్భంగా నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ మూవీ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో రూపొందిస్తున్నాం. ఈ రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ చిత్రంతో హీరో యిన్‌గా భైరవిని తెలుగు తెరకు తొలి పరిచయం చేస్తున్నాం. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో భైరవి సరిగ్గా సరిపోతుంది. హీరోకి మరదలు పాత్ర చేస్తుంది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్‌గా ఉండబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. త్వరలోనే టైటిల్, విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. తాటి భాస్కర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి యశ్వంత్ సంగీతం సమకూర్చుతున్నారు.