calender_icon.png 21 January, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'భైరవం' మమ్మల్ని మరో మెట్టుపైకి తీసుకెళ్తుంది

20-01-2025 08:42:55 PM

సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కాంబోలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్ర తన కలలో సృష్టించిన వైలెన్స్ వివరిస్తూ, అతని యాక్షన్‌ని శ్రీకృష్ణుడితో పోలుస్తూ లేడీ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ కథ వారాహి గుడి, ముగ్గురు స్నేహితులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ చుట్టూ సాగుతుంది. వారు ఒకరి కోసం ఒకరు ఎంతకైనా తెగిస్తారు. ప్రారంభ సన్నివేశాలు శ్రీనివాస్ పాత్ర ఇంటెన్స్ నేచర్‌ని హైలైట్ చేయగా, చివరిలో దేవుని ఆశీర్వాదం పొందుతున్నట్లుగా కనిపించడం కథలోని డివైన్ ఎలిమెంట్‌ని సూచిస్తోంది.

దర్శకుడు విజయ్ కనకమేడల ఈ టీజర్ ద్వారా సినిమా లీడ్ రోల్స్ సెంటర్ కాన్‌ఫ్లిక్ట్‌ని పరిచయం చేస్తూ, సినిమా ప్రిమైజ్‌ని రివిల్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ రస్టిక్ లుక్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనోజ్ మంచు, నారా రోహిత్ కూడా ఫెరోషియస్, డైనమిక్ రోల్స్‌లో కనిపించారు. టీజర్ వారి స్నేహాన్ని స్ట్రాంగ్‌గా ప్రెజెంట్ చేసింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈసారి మంచి కథా బలం ఉన్న సినిమాతో రావాలని బలంగా నిర్ణయించుకునే వస్తున్నాం. జయ జానకీ నాయక’కు మించి ఒక సినిమా చేయాలని నిర్మాత శ్రీధర్‌తో చెప్పాను. అలా మంచి కథ కోసం వేట మొదలైంది. అలా భైరవం లాంటి మంచి కథ దొరికింది. ఈ సినిమాకి డైరెక్టర్ విజయ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమానే ఆయన వోన్ చేసుకున్న విధానం సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. తప్పకుండా ఆయన టాప్ డైరెక్టర్ అవుతారు. ఈ సినిమాని రోహిత్ ఒప్పుకోవడం మోస్ట్ హ్యాపీ మూమెంట్. ఈ కథకు రోహిత్, మనోజ్ తప్పితే ఎవరూ చేయలేరనేంత గొప్పగా చేశారు. వాళ్లతో వర్క్ చేసే అవకాశం ఒక బ్లెసింగ్‌గా భావిస్తున్నాను. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈ సినిమా చేసాం. ఈ సినిమా మమ్మల్ని మరో మెట్టుపైకి తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను. అదితి, ఆనంది, దివ్య అద్భుతంగా నటించారు’’ అన్నారు.

హీరో మనోజ్ మంచు మాట్లాడుతూ.. విజయ్ ఈ కథ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. ఇందులో రోహిత్, సాయి ఉన్నారని చెప్తే ఇంకా ఎగ్జుటై అయ్యాను. వెంటనే ఒప్పుకున్నాను. డైరెక్టర్ విజయ్ చాలా డెడికేటెడ్ గా ఈ సినిమాని తీశారు. ఆయన హార్డ్ వర్క్‌కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమా చూశాను. సాయి పెర్ఫార్మెన్స్ చించి పారేశాడు. ఈ సినిమా గొప్ప విజయం కావాలని మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రోహిత్ నాకు చిన్నప్పటి నుంచి క్లోజ్. ఈ సినిమాతో ఇంకా క్లోజ్ అయిపోయాం. ఒక్కడు మిగిలాడు’ సినిమా 2016లో చేసినప్పుడు రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ గ్యాప్‌లో అది నా లాస్ట్ ఫిల్మ్. ఇప్పుడు మళ్లీ భైరవం’ టైటిల్‌తో రోహిత్‌తో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. తను అద్భుతంగా పెర్ఫాం చేశారు. తనతో కలిసి స్టెప్స్ వేయడం చాలా ఆనందంగా ఉంది. అదితి సింగర్, మంచి డాన్సర్. సినిమా దుమ్ము లేచిపోతుంది’ అన్నారు.

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ... భైరవం’ నా కెరియర్ ఎప్పుడూ చేయని ఒక క్యారెక్టర్. సినిమాని నాలుగు నెలల్లో కంప్లీట్ చేయడానికి డైరెక్టర్ విజయ్, ప్రొడ్యూసర్ రాధామోహన్ సపోర్టే కారణం. మనోజ్ నాకు చిన్నప్పటినుంచి పరిచయం. కానీ ఈ సినిమా మమ్మల్ని మరింత దగ్గర చేసింది. సాయితో వర్క్ చేయడం అద్భుతమైన జర్నీ. సెట్స్‌లో చాలా ఎంజాయ్ చేసాం. ఇది నాకు మోస్ట్ మెమొరబుల్ ఫిలిం’’ అన్నారు. 

డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. హీరో మనోజ్, సాయి,  రోహిత్ సపోర్‌తో సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. శ్రీచరణ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల పాట బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి చాలా అద్భుతమైన షట్ వర్క్ చేశారు. నిర్మాత రాధామోహన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. హరి ఫొటోగ్రఫీ ఈ సినిమాకి చాలా ప్లస్. ఇప్పటివరకు రోహిత్‌ని ఒకలాగా చూసుంటారు.. ఈ సినిమాలో మరోలా చూస్తారు. ఆయనలోని మాస్ యాక్షన్ బయటికి వచ్చింది. ఈ సినిమా మాస్ యాక్షన్ ఆడియన్స్‌కి పండగలా ఉంటుంది. మనోజ్‌తో పని చేస్తే ఎనర్జీ మామూలుగా ఉండదు. ఆయన్ని చూసి ఆడియన్స్ షాక్ అవుతారు. ఇప్పటివరకు సాయి చేసిన సినిమాలు వేరు ఈ సినిమా వేరు. ఈ సినిమాతో సాయి ఒక రేంజ్‌లో ఉంటారు. నన్ను కూడా ఒక మెట్టుపైకి తీసుకువెళ్తారు. ముగ్గురు హీరోలతో కలిసి పని చేయడం నాకు చాలా అద్భుతమైన అనుభూతి. నాందికి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాతో నాకు అంతకంటే మంచి పేరు వస్తుంది’’ అన్నారు. 

హీరోయిన్ అదితి శంకర్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ప్లీజ్ సపోర్ట్ చేయండి’’ అని కోరారు. నిర్మాత కేకే రాధామోహన్ మాట్లాడుతూ.. మా బ్యానర్ మొదలుపెట్టి 15 ఏళ్లు అవుతుంది. ముగ్గురు హీరోలు అనేసరికి నాకు, మా డైరెక్టర్‌కి కొంచెం టెన్షన్ వచ్చింది. అయితే మాకు ఎలాంటి టెన్షన్ ఇవ్వకుండా వాళ్లకు వాళ్లే చక్కగా మ్యానేజ్ చేసుకున్నారు. అనుకున్న టైంలో సినిమాని కంప్లీట్ చేయగలిగాం. డైరెక్టర్ చాలా పర్ఫెక్షనిస్ట్ . ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. శ్రీ చరణ్ ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. సినిమాలో బీజీఎం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కో ప్రొడ్యుసర్ శ్రీధర్ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు’’ అన్నారు. 

కో ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. సాయి, మనోజ్, రోహిత్ చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. నాలుగు నెలల్లో ఈ సినిమా పూర్తి చేయగలిగామంటే వాళ్ళ సహకారం వలనే. ముగ్గురికి థాంక్స్ చెప్తున్నాను. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, నటుడు సందీప్, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో మాట్లాడి తన అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు.