calender_icon.png 21 January, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబాన్ని కాపాడిన భైంసా పోలీసులు

20-01-2025 09:58:37 PM

బైంసా (విజయక్రాంతి): ఆత్మహత్యకు యత్నించిన ఒక కుటుంబాన్ని 100 డైల్ కు వచ్చిన సమాచారంతో పోలీసులు సత్వరమే స్పందించి వారిని కాపాడారు. సోమవారం సాయంత్రం 4:36 గంటల సమయంలో ఒక కుటుంబం కొన్ని కుటుంబ సంబంధించిన కలహాలతో బాధపడుతూ గడ్డెన్న వాగులో వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా దగ్గరలో నుండి చూసిన వసంత్ అనే వ్యక్తి 100 కి కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన భైంసా పట్టణ బ్లూ కోర్ట్ సిబ్బంది అయినా పిసి సాయి తేజ, అరవింద్ అదే ప్రాంతంలో ఉన్న పెట్రోల్ కార్ సిబ్బందికి సమాచారం తెల్పగా పెట్రోల్ కార్ ఇన్చార్జి అయిన ఏ.ఎస్ఐ సుదర్శన్ తో పాటు నితీష్ కుమార్, విజయ్ కుమార్ కానిస్టేబుల్ లతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని సూసైడ్ చేసుకునే కుటుంబాన్ని కాపాడి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ పెద్దలకు అప్పజెప్పిటం జరిగింది. పోలీసుల చర్యలను స్థానికులు అభినందించారు.