విక్టరీ వెంకటేశ్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ చైర్మన్ సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ విలేకరుల సమావేశంలో ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు? ఈ మూవీ జర్నీ ఎలా అనిపించింది?
-‘సుడల్’ వెబ్ సిరిస్ షూటింగ్‌లో ఉన్నప్పు డు డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్‌కి లుక్ టెస్ట్ చేయాలని అన్నారు. నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. ఆయన సినిమాలన్నీ చూశాను. ఇందులో నా క్యారెక్టర్‌కి ఒక యాస ఉంది. ఆ యాసతో పాటు ఆ లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ డైలాగ్ ఇచ్చారు. రెండు లైన్స్ చెప్పగానే చాలని చెప్పి స్క్రిప్ట్‌ని నరేట్ చేశారు. నరేషన్‌లో పడిపడి నవ్వుకున్నా. తెలుగులో నాకు ఇప్పటివరకూ సరైన డ్యూయెట్ సాంగ్ పడలేదు. ఆ లోటు గోదారి గట్టు పాటతో తీరింది.
భాగ్యం పాత్ర గురించి చెప్పండి..
-బిగినింగ్‌లో చాలా భయం వేసింది. ఎందుకంటే భాగ్యం.. మామూలు పాత్ర కాదు. కత్తి మీద సాములాంటి క్యారెక్టర్. కొంచెం బ్యాలె న్స్ తప్పినా కష్టమే. కాస్త శ్రుతిమించినా ఓవర్ డోస్ అయిపోతుంది. భాగ్యం పాత్రని అర్థం చేసుకోవడానికి నాకు పదిరోజులు పట్టింది.
వెంకటేశ్‌తో నటించడం ఎలా అనిపించింది ?
వెంకీ గారి ఎమోషన్స్ అన్నీ నేచురల్‌గా ఉంటాయి. ఆయన టైమింగ్ అద్భుతం. ఆయనతో కలిసి యాక్ట్ చేయడం మామూలు విషయం కాదు. అయితే ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. భాగ్యం క్యారెక్టర్‌లో అదరగొ డుతున్నావ్ అని మెచ్చుకునేవారు. కానీ డైలాగులు ఇచ్చేటప్పుడు టెన్షన్ వచ్చేసేది. చేతులు వణికేవి. ఒకసారి ఫీవర్ కూడా వచ్చింది (నవ్వుతూ). వెంకీ గారు, అనిల్ గారి సపోర్ట్ మర్చిపోలేను. వెంకీ గారు చాలా పాజిటివ్‌గా ఉంటారు. వండర్‌ఫుల్ పర్సన్.
మీనాక్షి చౌదరితో కలిసి యాక్ట్ చేయడం గురించి..
-మీనాక్షి చాలా సింపుల్. తనకీ, నాకు దగ్గర పోలికలు ఉన్నాయి. డాక్టర్ చదువుకుంది. కష్టపడి పైకి వచ్చింది. మీను సాంగ్‌లో తప్పితే.. వెంకటేశ్ గారు, నేను, మీనాక్షి.. ముగ్గురూ సినిమా అంతా ట్రావెల్ అవుతాం. మా ముగ్గురినీ చూడాల్సిందే. ఇందులో వెంకీ గారిది మా ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్.
దిల్ రాజు నిర్మాణంలో చేయడం ఎలా అనిపించింది?
-దిల్ రాజు, శిరీష్ గారి బ్యా నర్‌లో వర్క్ చేయడం నై స్ ఎక్స్‌పీరియన్స్.