24-03-2025 12:00:00 AM
కొత్తపల్లి, మార్చి 23 (విజయ క్రాంతి): సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో స్థానిక భగవతి పాఠశాలలో అరవ తరగతి చదువుతున్న పి. హరిణి అద్భుత ప్రతిభను కనబరచి తెలంగాణ జోనల్ స్థాయిలో 8వ ర్యాంక్ సాధించినట్లు పాఠశాలల చైర్మెన్ బి. రమణరావు తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడు తూ విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు, పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఇలాంటి ఒలంపియాడ్ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.