calender_icon.png 21 November, 2024 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్ నాటికి భగీరథ నీరు

16-10-2024 01:46:11 AM

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి,అక్టోబర్15(విజయక్రాంతి): డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ నీటిని కామారెడ్డి మున్సిపల్, ఆవాసాలకు సరఫరా చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సదాశి వనగర్ మండలం దగ్గి గ్రామం వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు ఆగిపోయిన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు.

దగ్గి గ్రామం వద్ద పైప్‌లైన్ పనులకు రాయి అడ్డువచ్చి పనులు నిలిచిపోయాయని, బ్లాస్టింగ్ చేసేందుకు ఆర్డీవో అనుమతి కావాలని ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అందుకు వెంటనే అనుమతించాలని ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. మరికొన్ని పనులు అటవీ భూముల్లో చేయాల్సి ఉన్నందున.. అనుమతి ఇవ్వాలని డీఎఫ్‌వోను కలెక్టర్ ఆదేశించారు.

జాతీయ రహదారి 44 వె ంబడి 41 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసి నీరు సరఫరా చేయాలని చెప్పారు.  కార్యక్రమంలో నిజామాబాద్ ఎస్‌ఈ రాజేంద్ర కుమార్, ఆర్డీవో రంగనాథ్‌రావు, జడ్పీ సీఈవో చందర్, ఈఈలు నరేశ్, రమేశ్, ఈఈలు నవీన పాల్గొన్నారు.