calender_icon.png 23 December, 2024 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగీరథ ప్రాజెక్టే రూ.28వేల కోట్లు

22-12-2024 01:01:31 AM

  1. రూ.50వేల కోట్ల కుంభకోణమంటే ఎలా?
  2. బీఆర్‌ఎస్ హయాంలోనే నల్లగొండ అభివృద్ధి 
  3. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు హరీశ్‌రావు కౌంటర్

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ శనివారం అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్‌రావు కౌం టర్ ఇచ్చారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు మొత్తం రూ.28వేల కోట్లయితే రూ.50వేల కోట్ల కుంభకోణమని ఆరోపించడంలో అర్థ మే లేదని కొట్టిపారేశారు.

బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి కనిపించాలంటే నల్లగొండ జిల్లాకే పోదామన్నారు. నల్లగొండలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, తుంగతు ర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు వెళ్తే వాస్తవం తెలుస్తుందన్నారు. నల్లగొండ జిల్లాలకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.