11-04-2025 01:31:07 AM
యాదగిరిగుట్ట డిపో మేనేజర్ సి. ఎచ్. మురళీ కృష్ణ
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చటానికి భువనగిరి బస్ స్టేషన్ నందు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి భువనగిరి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట డిపో మేనేజర్ సి. ఎచ్ మురళీ కృష్ణ అన్నారు. గురువారం రోజు భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ లో చలివేంద్రంను ప్రారంభించి ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి యాదాద్రి భువనగిరి జిల్లా ఆద్యాత్మిక కన్వీనర్ సోమ సీతా రాములు , భువనగిరి కన్వీనర్ సోమ కృష్ణమూర్తి , రచమల్ల వినోద్ , రాంచందర్ , పెంట బాలరాజు , సాయి క్రిష్ణా , చింతపండు రాజు , సోమ సరస్వతి , రాచమల్ల భాగ్యలక్ష్మి , సిహెచ్ దేవి , రమ్య , జయశ్రీ , అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ , గురువారం రోజు మజ్జిగ దాత నల్లా మాధురి దిలీప్ దంపతులు, చంద్ర మెడికల్ హాల్ చంద్రశేఖర్, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.