24-03-2025 12:45:09 AM
జనగామ, మార్చి 23(విజయక్రాంతి): దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణం గా పెట్టి పోరాడిన భగత్‌సింగ్‌ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని 15వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ మారబోయిన పాండు, భగత్‌సింగ్ యూత్ అధ్యక్షుడు మంతెన మణికు మార్, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్ పిలుపునిచ్చారు.
భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం జనగామ పట్టణంలోని సంజయ్ నగర్ చమాన్ వద్ద భగత్‌సింగ్ విగ్రహానికి వారు వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భగత్ సింగ్ చిన్నవయసులో విప్లవ పంథాలో దేశం కోసం కొట్లాడి అసువులు బాసారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వంగ భీమ్ రాజు, తాళ్లపెళ్లి వాసుగుప్తా, పళ్ల నాగరాజుగుప్తా, బర్ల ఆంజనేయులు, వంగ వెంకట్ నేత, ఎండీ.బాబా, రొడ్డ రవి, తాళ్లపెళ్లి చిదంబరంగుప్తా, భరత్ , వీహెచ్‌పీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యనిర్వహక్ రమేష్ జీ, జనగామ జిల్లా కార్యనిర్వాహక్ నరేందర్ జీ, భగత్ సింగ్ యూత్ నాయకుడు చిక్కుడు నగేష్ తదితరులు పాల్గొన్నారు.