24-03-2025 12:00:00 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, మార్చి 23: (విజయక్రాం తి): దేశాన్ని బ్రిటిష్ పాలకుల కబంధహస్తాల నుంచి విడిపించేందుకు భగత్ సింగ్ తన ప్రాణాలను అర్పించిన పోరాట యోధుడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొనియాడారు. ఈ మేరకు ఆదివారం స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భోలక్ పూర్ హౌస్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భగత్ సింగ్ విశిష్ట వ్యక్తి గల గొప్ప నాయకుడని కొనియాడారు. మనకు దేశం ఏమిచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏం చేశామన్నదే భగత్‌సింగ్ లక్ష్యం అన్నారు. తన లక్ష్యాలను నెరవేర్చేందుకు యువత కంకణ బద్దలు కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్‌ను బిఆర్‌ఎస్ నాయకులు శాలువాతో ఘనం గా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ యువ నాయకుడు ముఠా జై సింహ, డివిజన్ పార్టీ నాయకుడు నవీన్ కుమార్, బీఆర్‌ఎస్ మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, మైనార్టీ కమిటీ అధ్యక్షుడు మక్బూల్, నాయకులు ఎస్. నవీన్ కుమార్, గోవింద్, శంకర్ ముదిరాజ్, మహమ్మద్ అహమ్మద్, బబ్లు, భీమ్ కుమార్, సాయికుమార్, మహేష్ పాల్గొన్నారు.