23-03-2025 06:14:06 PM
కోదాడ: బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఆత్మ త్యాగాలు అజరామరమని ప్రజా చైతన్య వేదిక బాధ్యులు రాయపూడి వెంకటేశ్వరరావు పందిరి నాగిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెస్ కళాశాలలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. విప్లవం వర్ధిల్లాలి సామ్రాజ్యవాదం నశించాలని ఇంగ్లాండ్ పార్లమెంటులో భగత్ సింగ్ తో పాటు రాజగురువు సుఖదేవులు నినాదాలు చేశారని పేర్కొన్నారు. హరి కిషన్ రావు బడుగుల సైదులు మస్తాన్ రాపర్తి రామ నరసయ్య రాఘవరెడ్డి రాధాకృష్ణ ఉదయగిరి వేణు అప్పిరెడ్డి బాబు జాఫర్ లక్ష్మీనారాయణ హనుమంతరావు కాజా రవి పాల్గొన్నారు.