calender_icon.png 25 March, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా భగత్ సింగ్ 96వ వర్ధంతి..

23-03-2025 04:48:06 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల బ్రిటిష్ సామ్రాజ్యవాద దాస్య సుఖాలాల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి తన ప్రాణాలను తున ప్రాణంగా అర్పించిన మహా మహా నాయకుడు భగత్ సింగ్ అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. ఆదివారం భగత్ సింగ్ 96వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని సుందరయ్య స్మారక భవనం నందు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా  బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ... భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్య పాలకుల నుండి విముక్తి చేయడానికి 23 ఏళ్ల చిరు ప్రాయంలోనే భగత్ సింగ్ ఉరికంబానికి చిరునవ్వుతో ప్రాణాలర్పించారు.

స్వాతంత్ర పోరాట ఉద్యమంలో భగత్ సింగ్, రాజు గురు, సుఖదేవులు మిల్టెంటుగా ఉద్యమిస్తున్న తరుణంలో లాహోర్ జైల్లో ఉరి తీశారని అన్నారు. భగత్ సింగ్ హేతువాద వ్యక్తి, మానవ పరినామం సమాజ పరిణామం శాస్త్రీయంగా విశ్లేషించేవాడని మూఢచారులను తీవ్రంగా వ్యతిరేకించేవాడని అన్నారు. ఈనాటి యువత భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శాలను పాటించినప్పుడే మనము ఆయనకు అసలైన నివాళులు అర్పించినవాళ్ళం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జూలకంటి  విజయలక్ష్మి, బచ్చలకూర స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు చందా చంద్రయ్య దేశీ రెడ్డి స్టాలిన్ రెడ్డి, నందిగామ సైదులు, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్, సరికొండ నాగరాజు, అనంత్ కోటీ తదితరులు పాల్గొన్నారు.