calender_icon.png 22 March, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ రక్షణకు భగత్ సింగ్ స్ఫూర్తితో మరో స్వాతంత్రోద్యమం

21-03-2025 08:16:04 PM

భద్రాచలం,(విజయక్రాంతి): మతోన్మాదుల నుండి కార్పొరేట్ శక్తుల నుండి ఈ దేశ రక్షణకు మరో స్వాతంత్ర పోరాటం నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సభలు భద్రాచలం పట్టణంలో 1వ వార్డు, 19వ వార్డు, 20 వార్డుల నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్ లు దేశ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే ఉరితాలను ముద్దాడిన యువకుశోరాలని వారి త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని అన్నారు. అసమానతలు లేని, దోపిడీ లేని స్వతంత్ర భారతం కావాలని భగత్ సింగ్ కోరుకున్నారని అది సోషలిస్టు విధానంలోనే సాధ్యమని భగత్ సింగ్ గట్టిగా విశ్వసించారని అన్నారు. భగత్ సింగ్ లోని శాస్త్రీయ దృక్పథం నేటి సమాజానికి అవసరమని అన్నారు. తెల్ల దొరలో పోయి నల్ల ధరలు వచ్చారని పరిస్థితులలో నేడు ఏ మార్పు లేదని పాలకులు కార్పొరేట్ శక్తులకు దోశ పెడుతూ ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. నేడు దేశంలో మతాన్ని రాజ్యంతో విడదీయలేనంతగా కలిపేసి మత ప్రాతికిన రాజకీయ సమీకరణకు పాల్పడుతున్న పరిస్థితుల్లో భగత్ సింగ్ ఇచ్చిన స్ఫూర్తితో మత చాందసవాదుల నుండి, కార్పొరేట్ శక్తుల నుండి ఈ దేశ రక్షణకు మరో స్వాతంత్ర ఉద్యమం నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు ఎన్ . లీలావతి,డి రాఘవయ్య, భూపేంద్ర, శాఖ కార్యదర్శులు ఆది,డి రామకృష్ణ ,జి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.