18-04-2025 12:40:45 AM
చర్ల, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన చేస్తూ, రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచినట్లయితే మావోయిస్టులు జనజీవన శ్రవంతిలో కలిసే అవకాశం అధికంగా ఉందని ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు.
గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న రహదారి మార్గని ఆయన పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లోని పూసుకుప్ప అటవీ ప్రాంతం నుంచి బీజాపూర్ కి పోలీస్ ల సహకారంతో సుమారు 1.9 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఏజెన్సీ గిరిపుత్రుల కల నెరవేరింది, ఈ రహదారి మార్గం ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించి కాంట్రాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులతో రూ 3 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మించి రాకపోకలకు సిద్ధం కావడంతో రోహిత్ రాజు దండకారణ్యంలో చతిస్గడ్ సరిహద్దు వరకు స్వయంగా ఈ మార్గాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఎల్ బ్ల్యూ ఈ నిధులతో చేపట్టిన రోడ్ నిర్మాణం పూర్తిగా ఏజెన్సీ వాసులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.
చతిస్గడ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం చేసేందుకు పోలీస్ వ్యవస్థ భారీ బందోబస్తు నడుమ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టిందని శర వేగంగా రోడ్డు పనులు జరిగేలాగా చర్యలు తీసుకున్నామన్నారు . రానున్న రోజుల్లో చర్ల మండలానికి మహర్దశ పట్టనుందని. చతిస్గడ్ తెలంగాణ బోర్డర్ ప్రాంతంలో చర్ల మండలం ఉండడంతో రాకపోకల తో పాటు ప్రాంత అభివృద్ధి మరికొన్ని రోజుల్లో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు, ఈ రహదారి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా వరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుందన్నారు.
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు రహదారి మార్గం ఎంతగానో ఉపయోగపడుతుందని. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 95 మంది మావోయిస్టు క్యాడర్ ఉందని అండర్ గ్రౌండ్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్నారని ఎల్ వో ఎస్ గాని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కానీ వంటి మావోయిస్టు పార్టీ సభ్యులు స్థానిక పోలీస్ శాఖ ద్వారా జిల్లా ఉన్నతాధికారుల ద్వారా లొంగిపోయీ జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసులు ఎప్పుడు స్వాగతిస్తా రన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పి విక్రాంత్ సింగ్, సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్ కమాండెంట్ రాజ్ కుమార్, చర్ల మండల సిఐ రాజు వర్మ, ఎస్త్స్ర నర్సిరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.