21-03-2025 01:17:11 AM
44 రోజుల తర్వాత తిరిగి లెక్కించిన ఆలయ అధికారులు
భద్రాచలం, మార్చి 20 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు చిత్ర కూట మండపం లో గురువారం జరిగింది. పటిష్టమైన పోలీస్ భద్రతలో సీసీ కెమెరాలు మధ్య దేవదాయ శాఖ అధికారులు, ఈవో రమాదేవి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది.
గత 44 రోజుల క్రితం హుండీ లెక్కించగా తిరిగి గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా హుండీ ఆదాయం 44 రోజులకు 1కోటి ,14 లక్షల ,60 వేల ,041/_రూపాయలు నగదు వచ్చింది. అంతేకాకుండా బంగారం133 గ్రాములు, వెండి1262 గ్రాములు హుండీ ద్వారా స్వామివారికి భక్తులుసమర్పించారు.
వీటితోపాటుకెనడా దేశానికి చెందిన 50 డాలర్స్ యుఎస్.293 . డాలర్స్ సింగపూర్..7. డాలర్స్ యూరోస్..10 యూరోస్,బ్యాంక్ ఆఫ్ మలేషియా.50 రింగ్ ఇట్స్, చైనా..5 యువన్, కతర్ రియట్.. 2రియాట్,సౌదీ అరేబియన్..1రియల్,నేపాల్..5 రూపీస్ తో పాటు దేశ విదేశాల నుండి భక్తులు రామయ్యను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.గణనీయంగా భక్తుల రాకతో హుండీ ఆదాయం కూడా కథ గతం కంటే ఈసారి పెరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీలో యువ ఎల్ రమాదేవి ఏఈఓ శ్రావణ్ కుమార్ రామకృష్ణ దేవస్థాన అధికారులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.