calender_icon.png 3 April, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబైన భద్రాద్రి రామాలయం

30-03-2025 10:24:14 PM

భద్రాచలం (విజయక్రాంతి): పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయం విద్యుత్ దీపాలు అలంకరణతో దేదీప్యంగా వెలుగుతూ భద్రాద్రి వాసులను భక్తులను ఆకర్షిస్తున్నది. ఏప్రిల్ ఆరో తేదీన జరిగే సీతారాముల కళ్యాణం ఆ మరునాడు జరిగే పట్టాభిషేకంనకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పటికే ప్రధాన దేవాలయంతో పాటు అన్ని దేవాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో అవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అదేవిధంగా ప్రధాన కూడలిలలో స్వాగత ద్వారాలు కూడా ఏర్పాటు చేయడంతో కళ్యాణం వారం రోజులు ఉన్నప్పటికీ ఇప్పటికే భద్రాద్రిలో కళ్యాణ సందడి కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. భద్రాచలం దేవాలయంతో పాటు అనుబంధంగా ఉన్న పర్ణశాల శ్రీరామగిరి దేవాలయాల్లో కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీరామ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.