"తెలుగు కీర్తి " జాతీయ పురస్కార అవార్డులు"అందుకున్న లక్ష్మణ్ కుమార్, వరలక్ష్మీ...
శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డాక్టర్.కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా అవార్డ్ ప్రధానం
చర్ల (విజయక్రాంతి): వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పోయెట్రీ అకాడమీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, అంతర్జాతీయ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో శ్రీ కౌతపూర్ణనంద్ విళాస్ కళావేదికలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డాక్టర్ కె. ప్రతాప్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతి, తెలుగు వైభవం, సాహిత్యం కళల పరిరక్షణకు కృషి చేస్తూ, కవితలు, పాటలు, కథలు వ్రాస్తూ యువ రచయితలుగా సాహితీ కుటుంబంలో పేరు సంపాదించుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరికీ ఈ అవార్డు దక్కింది. భద్రాచలం నుండి వి.వరలక్ష్మి పౌల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాల చైర్పర్సన్, చర్ల మండలలకు చెందిన ప్రవేట్ కళాశాల ప్రిన్సిపాల్, జర్నలిస్ట్ జి. లక్ష్మణ్ కుమార్ లు "తెలుగు కీర్తి" ప్రతిభా పురస్కార అవార్డులు అందుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వీరికి అవార్డు రావడం పట్ల పలువురు కళాకారులు కవులు అధికారులు ప్రశంసించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... విభిన్న కళలతో పలువురిని ఆకర్షించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని మిమిక్రీ, కవితలు రాస్తూ రచనలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడం పట్ల గురు సామానులు కత్తిమండ ప్రతాప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తనకి అవార్డు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. త్వరలో భద్రాచలంలో జరగబోయే కవి సమ్మేళన కార్యక్రమంలో 'లక్ష్య పెట్టా మరువబోకు లక్ష్మన్న మాట' అనే వంద పద్యాలతో ఉండే పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ అవార్డులతో పాటుగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన శ్యామ్ సునార్కానికి, హైదరాబాద్ కు చెందిన పిట్లం కొండలరావుకి 'యువ తేజం' అవార్డు దక్కింది, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు వందల మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైభవంగా జరిపిన కవులను కళాకారులను శ్రీ శ్రీ కళా వేదిక కుటుంబాన్ని పలువురు జిల్లా కవులు కళాకారులు వీరిని అభినందించారు.
తెలుగు కీర్తి అవార్డు కార్యక్రమంలో భాగంగా మహాకవి బోయి భీమన్న సతీమణి బోయి హైమావతికి ఉమెన్ ఐకాన్ అవార్డును అందజేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నల్లా నరసింహమూర్తి నడక ఆరోగ్యం అంశంపై రచించిన 112వ నానీల కవిత సంపుటి నడక విజేత పుస్తకాన్నిడాక్టర్ కత్తిమండ ప్రతాప్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బోయి హేమావతి కవి డాక్టర్ నల్లా నరసింహమూర్తిని ప్రశంసించారు. కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి టి. పార్థసారధి, గోదావరి దినపత్రిక సంపాదకుడు బోళ్ల సతీష్ బాబు, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ గుత్తికొండ కొండలరావు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పి కొండా నరసింహారావు, రాజమహేంద్రవరం నన్నయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తర పట్ల సత్యనారాయణ, నవ మళ్లీ తీగ మాసపత్రిక సంపాదకుడు కలిమి శ్రీ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ కార్యదర్శి పెంచలయ్య శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ కమిటీ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ, శ్రీశ్రీ కళావేదిక యువతరం కవిత వేదిక అధ్యక్షుడు గరిమెళ్ల రాజేంద్రప్రసాద్, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టి అనిత, జాతీయ కమిటీ ప్రతినిధి నల్లా భాగ్యలక్ష్మి, జాతీయ విందు జాతీయ కోఆర్డినేటర్ నూక సంపత్ కుమార్ పుల్లేటికుర్రు శీను బాబు పాల్గొన్నారు.