calender_icon.png 9 January, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్కోటి ఉత్సవాలకు ముస్తాబైన భద్రాద్రి

09-01-2025 01:41:06 AM

  • నేడు గోదావరిలో తెప్పోత్సవం
  • రేపు వైకుంఠ ద్వార దర్శనం
  • ఉత్సవాలకు తరలిరానున్న భక్తులు

భద్రాచలం, జనవరి 8 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల పుణ్యక్షేత్రం ముక్కోటి ఉత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాతో దేవస్థాన అధికారులు, జిల్లా అధికార యంత్రాగం సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేపట్టారు. భద్రాచల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు స్వాగతం పలికేలా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు.

దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 31 నుంచి ప్రతి రోజు ఒక అవతారంలో రామయ్య భక్తులకు దర్శనం ఇస్తుండగా.. నేటి సాయంత్రం గోదావరి నది తీరంలో తెప్పోత్సవం, రేపు మిధుల స్డేడియం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార నుంచి దర్శనం ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

ఉత్సవాలకు దేశ నలుమూల నుంచి భక్తులు తరలిరానున్నారు. వారికి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్, దేవస్థాన ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. రెండు రాష్ట్రాల నుంచి ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా తిప్పుతున్నట్లు అధికారులు తెలిపారు.

తొలిసారి రివర్ ఫెస్టివల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గిరిజన టూరిజం ప్రదేశాలకు వెళ్లి గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను తిలకించడం, వారి వంటకాల రుచుల ఆస్వాదించడానికి రివర్ ఫెస్టివల్‌ను తొలిసారిగా ఏర్పాటు చేశారు. ప్యాకేజీ ప్రకారం మూడు రోజుల పాటు వసతి టిఫిన్, భోజనం, రవాణా సౌకార్యం, బోటింగ్‌తో పాటు గిరిజన ప్రాంతాల సందర్శించేలా ప్యాకేజీ ఉంటుంది.

ఏకాదశికి మట్టపల్లి క్షేత్రం ముస్తాబు

హుజూర్‌నగర్, జనవరి 8: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి కృష్ణా నదీ తీరంలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వైకుంఠ ఏకా  ఉత్సవాలకు ముస్తాబు అయింది. 9, 10 తేదీల్లో జరిగే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అనువంశిక ధర్మకర్త చెన్నూరు విజయ్‌కుమార్ తెలిపారు.