05-03-2025 06:30:20 PM
అధ్యక్ష కార్యదర్శులుగా విజ్జిగిరి రాజా కిరణ్, కొలిపాక నరసింహ స్వామి..
భద్రాచలంలో ఈ నెల 8, 9 తేదీలలో ఫ్లెక్స్ ప్రింటింగ్ బంద్..
భద్రాచలం (విజయకాంతి): భద్రాచలం డివిజన్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ సమావేశం పట్టణంలోని భూపతిరావు కాలనీలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ అనుబంధ అసోసియేషన్ ను బుధవారం ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు. భద్రాద్రి ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజ్జిగిరి రాజా కిరణ్ (కిరణ్ ఫ్లెక్స్), కార్యదర్శిగా కొలిపాక నరసింహ స్వామి (సన్ ఫ్లెక్స్) తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, క్యార్యదర్శులు మాట్లాడుతూ... ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఫ్లెక్స్ ప్రింటింగుకి సంబందించిన ముడిసరుకుల ధరలతో పాటు రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు. దీంతో రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ధరలను స్పల్పంగా పెంచడంతో పాటు ఈ విషయం ప్రజలకు తెలవడం కొరకు ఈ నెల 8, 9 తేదీలలో భద్రాద్రిలో ఫ్లెక్స్ షాపులను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. కావున ప్రతి ఒక్కరు సహకరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో సభ్యులు రాధాకృష్ణ, సతీష్, నజీర్, విజయ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.