calender_icon.png 3 April, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

31-03-2025 12:00:00 AM

భద్రాచలం, మార్చి 30 (విజయక్రాంతి):- భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా భద్రాచలం. శ్రీసీతారామచంద్ర స్వామివారి వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. తొలుత పవిత్ర గోదావరి నది నుండి  పుణ్య జలాన్ని తీర్ధబిందెతో మేళతాళాల మధ్య  తీసుకువ చ్చి నిత్య కళ్యాణ మండపంలో ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్లకు పంచామృతాలతో అభిషేకం,విశేష స్నపనం,మృత్సంగ్రహణం,వాస్తు పూజలు  ఆలయ అర్చకులు, వేదపండితులు ఘనంగా  నిర్వహించారు. ఏప్రిల్ 6న జరిగే స్వామివారి కళ్యాణ క్రతువులో పాల్గొనే రుత్వికుల కు, అర్చకులకు దీక్షా వస్త్రాలు  ఆలయ ఏఈఓ శ్రవణ్  అందచేశారు.

అనంతరం ఉత్సవ మూర్తులకు అభిషేకం పుణ్యహవచనం, విశేషాంగ స్నపన తిరుమంజనం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 5 వ తేదీ  సాయంత్రం ఎదుర్కోళ్ళు ఉత్సవం,ఏప్రిల్ 6 న శ్రీరామనవమి, ఏప్రిల్ 7 న పట్టాభిషేకం ఉత్సవాలను ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా యావన్మంది భక్త జన సందోహం మధ్య మిథిలా ప్రాంగణంలో చేయనున్నారు. ఈసారి సుమారు లక్ష వరకు భక్తు లు రామయ్య కల్యాణానికి రానున్నారని ఆ దిశగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు ఆలయ అధికారులు. సాయంత్రం తాత గుడి సెంటర్ లో ఉన్న గోవిందరాజు స్వామి గుడి వద్ద మత్సంగ్రహణం(పుట్ట మన్ను) సేకరించి ఆలయంలో వాస్తు పూజ, పుణ్యహవచనం పూజా కార్యక్రమం తో అంకురార్పణ నిర్వహించారు.