calender_icon.png 20 April, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మికుంటలో భద్రాద్రి బ్యాంక్ శాఖ ప్రారంభం

11-04-2025 12:55:46 AM

కరీంనగర్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): భద్రాద్రి బ్యాంక్ 23 వ శాఖను కరీం నగర్ జిల్లా జమ్మికుంటలో ప్రారంభించారు. పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ లో చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి  ముఖ్య అతిథి గా పాల్గొని నూతన శాఖ ను ప్రారంభించారు.

స్ట్రాంగ్ రూమ్ ను జనరల్ సర్జన్ డాక్టర్ రాము, క్యాష్ కౌంటర్ జాయింట్ రిజిస్టర్, జిల్లా సహకార అధికారి  సముద్రాల రామానుజ చార్య పాల్గొని ప్రారంభించారు..ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఒక్క శాఖ తో ప్రారంభం అయ్యి నేడు 23 వ శాఖను ప్రారంభించామని తెలిపారు. తమ బ్యాంక్ 70 వేల మంది  ఖాతా దారులకు సేవలు అందిస్తున్నదని చెప్పారు.

బ్యాంక్ సుమారు రూ.1000 కోట్ల టర్నోవర్ కలిగివుంది అని వెల్లడించారు. కస్టమర్ల కు గృహ, వ్యాపార,  చిన్న తరహా పరిశ్రమలు,  ఎడ్యుకేషన్ తోపాటు అన్ని రకాల లోన్స్ ఇస్తామని చెప్పారు. బ్యాంక్  సీఈఓ దాసరి వేణుగోపాల్, డీజీఏం ఎల్వీఎస్ ప్రసాద్, వైస్ చైర్మన్లు సన్నే ఉదయ్ ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరావు, బ్యాంక్ డైరెక్టర్స్, మేనేజర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.