19-03-2025 01:18:39 PM
భక్తుల భారీ స్పందన
భద్రాచలం,(విజయక్రాంతి): దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం నాడు సీతారామచంద్ర స్వామి వారి నిత్య కళ్యాణం వైభోగంగా జరిగింది. ప్రధాన దేవాలయం నుండి ఉత్సవ మూర్తులను బేడ మండపం వద్దకు తోడుకొని వచ్చి ఆసీనులు చేసి నిత్య కళ్యాణం నిర్వహించారు. స్వామివారి నిత్య కళ్యాణం లో పాల్గొంటే, పాల్గొనే జంటలు సకల పాపాలు పోయి, సుఖ సంతోషాలతో ఉంటారనే నమ్మకంతో దేశం నలుమూలల నుండి ప్రతిరోజు వందలాదిమంది భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం లో పాల్గొంటారు.
స్వామి వారి నిత్య కళ్యాణం అనంతరం మూల వరులను దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించటం అనవాయితీ. ఈ కార్యక్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన పాల్గొనడం కూడా ప్రతిరోజు జరుగుతుంది. శనివారం, ఆదివారము, పండుగ రోజులలో ఈ సేవకు భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది. బుధవారం స్వామివారి బేడ మండపంలో జరిగిన నిత్య కళ్యాణం లో పలువురు భక్తులు పాల్గొని కనులారా కళ్యాణం వీక్షించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం జరిగిన నిత్య కల్యాణంను ఆలయ అర్చకులు శాంతి స్వరూప్ నిర్వహించగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి తో పాటు అధికారులు రామకృష్ణ శ్రావణ్ కుమార్ రవీంద్రనాథ్ సాయిబాబా శ్రీనివాసులు భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు.