calender_icon.png 18 April, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం రైల్వే స్టేషన్‌కు కొత్తరూపు!

11-04-2025 12:00:00 AM

* అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రూ.25. 41 కోట్ల నిధులు 

* శరవేగంగా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): భారతీయ రైల్వేలో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏ బి ఎస్ ఎస్) పథకంలో తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను రూ 2,737 కోట్ల అంచనా తో  ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలను అందించడం, ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి, పునరాభివృద్ధి పనులు చేయబడుతున్నారు.

ప్రధానమంత్రి నరేం ద్ర మోడీ ఆగస్టు 2023, ఫిబ్రవరి 2024 లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల అభివృద్ధికి స్వీకారం చుట్టారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ఈ జాబితాలో ఉంది.  రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్లను ఆధునికరించడం, దీర్ఘకాలికతను దృష్టిలో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ విధానాన్ని రూపొందించారు.

ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా స్టేషన్ల ప్రోత్సాహాన్ని పెంచే మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ కీలక అంశాల అమలుపై ఆధారపడిందని చెప్పవచ్చు. ఈ పథకంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గల భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ ను సైతం ఏ బి ఎస్ ఎస్ పథకంలో చేర్చి పునరాభివృద్ది చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వేల ప్రారంభం రోజుల్లో నాటి గొప్ప చరిత్రను కలిగి ఉంది.

మొదట్లో ఈ స్టేషన్ సమీపంలోని గనుల నుంచి నిజాం నవాబులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బొగ్గును రవాణా చేయడానికి నిర్మించారు. కాలక్రమేనా ఇది హైదరాబాద్, విజయవాడ, వరంగల్, ఇతర ప్రధా న నగరాలను కలుపుతూ కీలకమైన రవా ణా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ స్టేషన్ ముఖ్యంగా జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ప్రవే శ ద్వారంగా ఉంటూ భద్రాచలం రోడ్స్ గా పేరొందింది. ప్రతి ఏడాది లక్షలాది మంది యాత్రికులను, పర్యాటకులను ఆదరిస్తోంది.

ఈ స్టేషన్ భద్రాచలం ఆలయ పట్టణానికి సమీపంలో ఉండటం వల్ల భక్తులు, ప్రయాణికులకు ఇది ఎంతో అనువుగా ఉం ది. ప్రస్తుతం ఈ స్టేషన్ ఇటీవల కాలంలో ఘననీయంగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. అందు లో భాగంగా విద్యుదీకరణ, భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం ఉన్నాయి. ఈ కొత్త రైల్వే లైను దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి కాలరీస్ కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తద్వారా బొగ్గు రవాణాను సులభతరం చేయడం ఈ ప్రాంతంలో ఆర్థికవృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం రూ 25 .41 కోట్ల వ్యాయంతో ప్రయాణికుల వెయిటింగ్ రూములు, ఎస్కలేటర్, లిఫ్ట్ మెరుగైన ఆధునిక  సౌకర్యాలతో పునరాభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో ఈ స్టేషన్ ము ఖ్యమైన రైల్వే స్టేషన్లో జాబితాలో చేర్చబడిందని చెప్పవచ్చు . నాన్ సబర్బన్ గ్రేడ్ 4 గా వర్గీకరించబడిన భద్రాచలం రోడ్స్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. డోర్నకల్-మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న ఈ స్టేషన్ వార్షిక ఆదాయం రూ 7.61 కోట్లు, సగటున రోజుకు 8,020 మందే ప్రయాణికుల రాకపోకలకు  సేవలందిస్తోంది. భద్రాచలం రోడ్డు స్టేషన్లో 3 జతల రైలు బయలుదేరుతాయి, ముగుస్తాయి. రెండు రైలు నిలుస్తాయి. 

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో:

ప్రస్తుతం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రూ 25.41 కోట్లతో స్టేషన్ భవనం ముఖద్వారం అభివృద్ధి. ఆకర్షణీయమైన ప్రవేశద్వారం ఏర్పాటు, ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన, (ఫుట్ ఓవర్ బ్రిడ్జ్), నిర్మాణంతో పాటు ఒక లిఫ్ట్, ఎస్కలేటర్ ఏర్పాటు, ప్లాట్ ఫామ్ ఉపరితల మెరుగుదలలు, ప్లాట్ ఫామ్ పై అదనపు కప్పు ఏర్పాటు, ఇప్పటికే ఉన్న టాయిలెట్లకు మెరుగుదలలు, దివ్యాంగుల సౌకర్యాలకు కొత్త టాయిలెట్ బ్లాకుల నిర్మాణం, వెయిటింగ్ హాల్ అభివృద్ధి స్టేషన్ వినియోగదారులకు ఆహ్లాదకరమైన ప్రకృతి అనుభవాన్ని అందించడానికి స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం, ట్రాఫిక్ సజావుగా సాగడానికి స్టేషన్ ప్రాంగణంలో మెరుగుదల తదితర పనులు చేపట్టారు.

స్టేషన్ ప్రాంతాల్లో కళలు, సాంస్కృతిక చిత్రీకరణ, ప్రయాణికులకు అనుకూలమైన సంకేతాలు రైలు సూచిక బోర్డులు,కోచ్ సూచిక బోర్డులు మొదలైనవి ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 45% పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి భద్రాచలం రోడ్డు అన్ని హంగులతో కొత్త రూపం అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు.