11-04-2025 03:10:08 PM
భద్రాచలం(విజయక్రాంతి): మే 5 నుంచి 12 వరకు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జరిగే ఏషియన్ జూనియర్ ఎక్యిప్పడ్ పోటీలకు 66 కేజీల విభాగంలో ఎంపికైన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ మోడెం వంశీని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు(Bhadrachalam MLA Tellam Venkat Rao) వారి నివాసంలో అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మాల్టా దేశంలో సౌత్ ఆఫ్రికా దేశంలో గతంలో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో రెండు బంగారు పతకాలు సాధించిన విధంగానే ఈసారి కూడా బంగారు పతకం సాధించి మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. అంతేకాకుండా జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులను కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, మోడెం వంశి పాల్గొనడం జరిగింది.