calender_icon.png 21 March, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులు కనీస సామర్థ్యాలు నేర్చుకుంటారు

21-03-2025 07:18:48 PM

భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి తోటమల్ల రమ

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచల పట్టణం జగదీష్ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల(Bhadrachalam Mandal Parishad Upper Primary School)లో ఎఐ టీచింగ్ & లెర్నింగ్ ప్రోగ్రాంని  జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశానుసారం భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి టి.రమ(Bhadrachalam Mandal Education Officer T.Rama) శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి టి.రమ మాట్లాడుతూ విద్యార్థుల కనీస సామర్ధ్యాలను అభివృద్ధి పరచడానికి ఎఐ టూల్స్ ఉపకరిస్తాయని విద్యార్థులు వాటిని సద్వినియోగపరుచుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఐటిసి ప్రోగ్రాం మేనేజర్ జయప్రకాష్(ITC Program Manager Jayaprakash) మాట్లాడుతూ... ఐటిసి భద్రాచలం వారి సహకారంతో భద్రాచల పరిసర ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని పాఠశాలకు మౌలిక వసతుల సదుపాయాలు, ప్రథమ్ ద్వారా వాలంటీర్ల నిర్వహణ, ప్రథం ఇన్ఫోటెక్ వారి ద్వారా కంప్యూటర్ విద్య, హెల్త్ ఐజిన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని పాఠశాలలకు  కావలసిన కనీస అవసరాలు తీర్చడానికి ముందుంటామన్నారు.

విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి చెందాలి అంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు రాజ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ప్రోగ్రాం ని  ఉపయోగించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఐటీసీ ప్రోగ్రాం ఆఫీసర్ గీత ప్రవల్లిక(ITC Program Officer Geetha Pravallika), ప్రదమ్ రీజనల్ మేనేజర్ సందీప్, ప్రదం ఇన్ఫోటెక్ కోఆర్డినేటర్ ప్రసాద్, హెల్త్ అండ్ ఐజిన్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు నాగమణి, సైదులు, లక్ష్మి, అనురాధ, రామలక్ష్మి, సీత, మనీషా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లాలో ఉత్తమ మండల విద్యాశాఖ అధికారిగా గౌరవ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించబడిన మండల విద్యాశాఖ అధికారి రమ ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం సన్మానించారు.