calender_icon.png 21 March, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాద బాధితులకు భద్రాచలం లైన్స్ క్లబ్ చేయూత

20-03-2025 05:56:34 PM

భద్రాచలం (విజయక్రాంతి): తోటపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ధారా వెంకటేశ్వర్లు, కాటూరి నరసమ్మ కుటుంబాలకు లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం, నక్క వెంకన్న, సిద్ధారెడ్డి సహకారంతో నిత్యావసర సరుకులను అందజేసింది. లైన్స్ క్లబ్ అధ్యక్షుడు చిట్టినీడు రామలింగేశ్వర రావు మాట్లాడుతూ... బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు నక్క వెంకన్న, సిద్ధారెడ్డి ముందుకు వచ్చారని ప్రశంసించారు. లైన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొనగా, నక్క వెంకన్న, సిద్ధారెడ్డి బాధితులకు సహాయ సామగ్రిని అందజేశారు.