23-02-2025 10:29:39 PM
సెంట్రల్ లైటింగ్ నిర్వహణ అధ్వానం..
పొంచి ఉన్న ప్రమాదం..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రూ.లక్షలు ఖర్చుపెట్టి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.. దాని నిర్వహణ గాలికి వదిలారు. ఫలితంగా కొత్తగూడెం- భద్రాచలం ప్రధాన రహదారి అక్కడక్కడ అంధకారం తాండవిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం మొదలుకొని పాల్వంచ పట్టణం, లక్ష్మీదేపల్లి, కేశవాపురం జగన్నాధపురం పంచాయతీల వరకు విస్తరించి ఉన్న సెంట్రల్ లైటింగ్ నిర్వహణ మాత్రం అధ్వానంగా ఉంది. దీంతో ద్విచక్రవాహన చోదకులకు కొంత వెలుగు మరికొంత చీకటి రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పాల్వంచ పట్టణ పరిధిలోని నవ నగర్ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి నుంచి ఎన్ ఎం డి సి కర్మాగారం వరకు సెంట్రల్ లైటింగ్ వెలగక అంధకారాన్ని తాండవిస్తున్నాయి. పాల్వంచ మున్సిపల్ అధికారులు సెంట్రల్ లైటింగ్ నిర్వహణ పట్ల దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.