calender_icon.png 2 February, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భద్రాచలానికి ముంపు ప్రమాదం

01-02-2025 10:08:11 PM

సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి...

భద్రాచలం (విజయక్రాంతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భద్రాచలం కు ముంపు ప్రమాదం పెరిగిందని సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అన్నారు. గతంలో 39.28 మీటర్లు ఎత్తులో నీటి నిల్వ ఉండే విధంగా ఉన్న ప్రాజెక్టు డిజైన్ ను ప్రస్తుతం 41.15 మీటర్ల ఎత్తున నీటి నిల్వ ఉండే విధంగా ఆమోదం తెలిపిందని, దానికి అనుగుణంగా పోలవరం వ్యయం అంచనా పెంచిందని, ఇది భద్రాచలం ప్రాంతానికి ముంపు ప్రమాదం పెరిగే అవకాశం ఉందని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం ముంపు పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే రీ సర్వే చేయించాలని ఆయన పేర్కొన్నారు.