calender_icon.png 26 March, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతలు స్వీకరించిన భద్రాచలం నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

25-03-2025 07:42:02 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ గా ఎస్ఎ జానీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పులమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారి జానీ మాట్లాడుతూ... భద్రాచలం నందు అధికారిగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉన్నదని, అటు రైతులకు, ఇటు ఉద్యోగస్తులకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతానని తెలుపుతూ... ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా టిఎన్జీస్ జనరల్ సెక్రెటరీ, గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా ట్రెజరర్ బాలకృష్ణ, జిడ్డు తిరుపతి మాట్లాడుతూ... కార్యనిర్వాహక ఇంజనీర్ అనేది ఎంతో బాధ్యతను కూడుకుని ఉంటున్నదని.. దానికి ఎస్ఎ జానీ వన్నె తీసుకొస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ జిల్లా సెక్రెటరీ  సామల శ్రీనివాస్, సూపర్డెంట్ బాలకృష్ణ, ట్రెజరర్ పడిగ నరసింహారావు, అనిల్ కుమార్ గాంధీ లింగమూర్తి బ్రహ్మారావు ప్రమోద్ పాపారావు రాజు విజయ్ కుమారి పవిత్ర రాజేశ్వరి రూప తదితరులు పాల్గొన్నారు.