12-04-2025 06:40:25 PM
సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి..
భద్రాచలం (విజయక్రాంతి): ఏప్రిల్ 13వ తేదీన ఖమ్మంలో నిర్వహించే బెంచ్ ప్రెస్ పోటీలకు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ నుంచి 12 మంది క్రీడాకారులు, 1 క్రీడాకారిణి ఎంపికైనట్లు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి తెలిపారు. ఎంపికైన వారిలో మహంతి వెంకటకృష్ణాజి, గాలి రామ్మోహన్ రావు, డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, ఎస్.కె అబ్దుల్ ఫరూక్, గుగులోతు శోభన్ నాయక్, డివి శంకర్రావు కోమండ్ల వేణు, సరియం భరత్ కుమార్, వి కాశి కుమార్, కృష్ణమూర్తి, మామిడి భూమిక, ఎంపికైనట్లు తెలిపారు. ఈ ఎంపికైన క్రీడాకారులు గతంలో కూడా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో కూడా సత్తా చాటినట్లు జిమ్ కోచ్ జివి రామిరెడ్డి తెలిపారు.