28-03-2025 12:31:06 PM
బాధ్యత కుటుంబ సభ్యుల ఆందోళన
కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని ఆరు అంతస్తుల భవనం కూలటం(Bhadrachalam building collapse)తో దాని క్రింద పడి మరణించిన భవన నిర్మాణ కార్మికులు పడిశాల ఉపేందర్, చల్లా కామేశ్వరరావులకు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూనియన్ సభ్యులు(Telangana Building Construction Union members), ఎమ్మార్పీఎస్ సభ్యులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పోస్ట్మార్టం రూమ్ ముందు శుక్రవారం ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వం వెంటనే చనిపోయిన కామేశ్వరరావు, ఉపేందర్ రావులకు ప్రభుత్వ పరంగా 1 కోటి రూపాయలు నష్టపరిహారం , ఇరువురి కుటుంబాలలో ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, భవనం నిర్మిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం రూమ్ వద్ద ఆందోళన చేస్తున్న బాధితులను అక్కడి నుండి బయటకు పంపించడానికి పోలీసులు శతవిధాల ప్రయత్నించినప్పటికీ ఎవ్వరూ కదలకుండా ఆందోళన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐటియు నాయకులు ఏజే రమేష్ బాల నర్సారెడ్డి గడ్డం స్వామి తో పాటు పలువు పాల్గొన్నారు.