03-04-2025 01:31:57 AM
దేవస్థాన అధికారులకు, అర్చకులకు అందజేసిన తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం గ్రామస్థులు
భద్రాచలం, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): భద్రాచల రాములవారి ఆలయంలో ఏప్రిల్ ఆరో తేదీన జరిగే సీతారాముల కల్యాణానికి ఉపయోగించే కోటి తలంబ్రాలను బుధవారం ఉదయం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం గ్రామం నుంచి వచ్చిన భక్తులు దేవస్థాన అర్చకులకు, అధికారులకు అందజేశారు.
గత 14 సంవత్సరాలుగా తూర్పుగోదావరి జిల్లా గోదావరి మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన కళ్యాణం అప్పారావు నాయకత్వంలో ఆ గ్రామస్థులు భద్రాద్రి రామయ్య కళ్యాణానికి కోటి తలంబ్రాలను అందజేస్తున్నారు.
ఈ ఏడాది కూడా అందజేయడానికి గత జూన్ నెలలో భద్రాచలం వచ్చి భద్రాద్రి రామయ్య సమక్షంలో వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీసుకెళ్లి పంట పండించారు. ఏడాది పంట దిగుబడి 800 కేజీలు రాక రాగా వాటిని ఐదు రాష్ట్రాల్లో 5 వేల మం దితో ఒలిపించి బుధవారం భద్రాద్రి రామయ్యకు అందజేశారు.