calender_icon.png 19 February, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీటెక్ పట్టభద్రులకు బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్లింగ్ కోర్సు!

16-02-2025 12:25:38 AM

  1. నేడు గచ్చిబౌలి ఈఎస్‌ఐసీ ప్రాంగణంలో ప్రవేశ పరీక్ష
  2. బ్యాంకింగ్ సంబంధిత జీసీసీల్లో యువతకు కొలువులే లక్ష్యం
  3. రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): స్కిల్ యూనివర్సిటీ ద్వారా బ్యాం కింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) జీసీసీలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులుగా తెలంగాణ యువతను తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

ఇందుకోసం బీఎఫ్‌ఎస్‌ఐ -స్కిల్లింగ్ పేరిట ప్రత్యేక ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా అందిస్తున్న బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆదివారం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ ఆఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్‌ఐసీ) ప్రాంగణంలో పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షలో ఎంపికైన బీటెక్ పట్టభ ద్రులకు నాలుగు నెలలపాటు బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ మార్కె ట్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్, ప్రోగ్రామింగ్, అప్లికేషన్ అండ్ డేటాబేస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై ట్రైనింగ్ ఇస్తామని మంత్రి చెప్పారు.

శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్స్ పొం దేలా సహకరి స్తామన్నారు. ఈ కోర్సు కోసం ప్రత్యేకంగా ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని చెప్పారు. కేవలం సర్టిఫికెట్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ అవసరాలకు ఒక్కసారి రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 

పరీక్ష ద్వారా ఎంపిక

ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థులను పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని మంత్రి తెలిపారు. ఈ దఫా కోర్సు కోసం 1,320 మంది బీటెక్ పట్టభద్రులు రిజిస్టర్ చేసుకున్నట్లు శ్రీధర్‌బాబు చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశపెడుతు న్నామన్నారు.

ఉద్యోగాలు కోసం ప్రయత్నిస్తున్న పట్టభద్రులు స్కిల్స్  యూనివర్సిటీ వెబ్ సైట్ (yisu.in)ను తరచూ సందర్శించాలన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) లో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవ తీసుకొంటుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 355 జీసీసీలుండగా, 3లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు చెప్పారు.

దిగ్గజ కంపెనీలు తమ కొత్త జీసీసీలను ఇక్కడ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శ్రీధర్‌బాబు పేర్కొన్నా రు. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో ఏర్పాటవుతున్న జీసీసీల సంఖ్య పెరుగుతుందన్నారు.