మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, జూలై 6 (విజయక్రాంతి): జునోసిస్ వ్యాధుల పట్ల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జూలై 6న ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నర్సాపూర్ పశు వైద్యశాలలో జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ.. మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసర మన్నారు. కుక్కల నుంచి రేబిస్, పశువులు, మేకల వంటి గడ్డి తినే జంతువుల నుంచి ఆంత్రాక్స్ వ్యాధులు సోకుతాయని, వీటినే జునోసిస్ వ్యాధులు అంటారని వివరించా రు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డిలో నిర్వహించిన ప్రపంచ జునోసిస్ దినోత్సవంలో కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొని కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్య అధికారి రవీందర్ పాల్గొన్నారు.
టీకాలు విధిగా వేయించాలి..
పెంపుడు, వీధి కుక్కలకు, పిల్లులకు విధి గా టీకాలు ఇప్పించాలని పశు సంవర్థక శాఖ సిద్దిపేట జిల్లా అధికారి డాక్టర్ సత్యప్రసాద్ రెడ్డి సూచించారు. జునోసిస్ డే సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్న పశు వైద్యశాలల్లో పెంపుడు, వీధి కుక్కలకు, పిల్లులకు రేబిస్ నివారణ టీకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.