14-04-2025 01:36:43 AM
ఇనుగుర్తిలో పసుపు దొంగతనం
మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): ఆరుగాలం అష్ట కష్టాలు పడి అన్నదాతలు పండించిన పంటలను దొంగలు ఎత్తుకెళుతున్న ఘటనలు మహబూబాబాద్ జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన తాటిపాముల ఆంజనేయులు ఎకరం భూమిలో పసుపు సాగు చేసి, పంటను భూమి నుండి ఇటీవలే వెలికి తీసి ఉడికించి తన పొలం వద్ద ఆరబెట్టాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రైతు ఆరబోసిన పసుపు నుంచి రెండు క్వింటాళ్ల వరకు దొంగలు ఎత్తుకెళ్లారు. ఎత్తుకెళ్లిన పసుపు విలువ సుమారు 20 వేల రూపాయలు ఉంటుందని కేసముద్రం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.