calender_icon.png 24 October, 2024 | 3:59 AM

వర్షకాలం పశువులు జాగ్రత్త

15-07-2024 12:47:54 AM

వాతావరణ మార్పులతో వ్యాధులు

కీటకాలున్న పచ్చగడ్డితో ప్రమాదం

పశువైద్యుల సూచనలు తప్పనిసరి

సిద్దిపేట, జూలై 1౪(విజయక్రాంతి): వర్షాకాలంలో పరిసరాల ప్రభావం, వరద నీరు, కీటకాలున్న పచ్చి గడ్డిని తినడంతో పశువుల కు వ్యాధులు సోకే ప్రమాదముంది. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నుంచి పశువుల ను కాపాడుకునేందుకు రైతులు పశువైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలి. 

గొంతువాపు వ్యాధి

వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా వచ్చే వ్యాధి గొంతువాపు. గురకవ్యాధి అని కూడా అంటారు. సూక్ష్మజీవుల వల్ల పశువులకు సంక్రమిస్తుంది. దాంతో అంటువ్యా ధిగా ఇతర పశువులకు కూడా వ్యాపిస్తుంది. కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారు స్తూ, తగురక, శ్వాస పీల్చడం కష్టమవుతుం ది. 104 నుంచి 106 డిగ్రీల వరకు తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందికి నీరు దిగుతుంది. ఈ వ్యాధి సోకిన పశువు 24గంటల్లో మరణించే అవకాశాలుంటాయి. ఈ వ్యాధి తెల్లజాతి పశువులకు మాత్రమే (ఆవులు, ఎద్దులు) వస్తుంది. ఈ వ్యాధిని నివారించడానికి వర్షాకాలానికి ముందే వ్యాధి నిరోధ క టీకాలు ఇప్పించాలి. వ్యాధి సోకిన పశువులకు వ్యాధి తీవ్రతను బట్టి సల్ఫాడిమిడిన్, ఇంటాసెప్టీజు, ఎక్సెప్ట్ వంటి ఇంజెక్షన్లు ఇప్పించాలి. 

జబ్బువాపు

ఈ వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరం ఉంటుంది. జబ్బు వద్ద వాపు(ఉబ్బి) ఉంటుంది. ఆ వాపును ముట్టినప్పుడు కొద్దిమెర శబ్దంలాగ వస్తుంది. ఈ వ్యాధి నల్ల పశువులకు మాత్రమే (గేదెలు, దున్నపోతు లు) వస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులకు తప్పనిసరిగా యాంటిబయోటిక్స్ ఇప్పించా లి. వ్యాధులు సోకిన పశువులు మేతమేయడంలో, నడవటంలో మార్పులను గమనించాలి. 

గాలికుంటు వ్యాధి, నంజు జ్వరం

ఈ వ్యాధి కలుషితమైన గాలి ద్వారా వస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వచ్చే అవకాశం ఉంటుంది. గిట్టలు ఉన్న ప్రతి జీవికి ఈ అంటువ్యాధి వస్తుంది. నోటిలో, గిట్ల మధ్య పుండ్లు పడి పశువులు పడవలేని స్థితికి చేరతాయి. నోటి గిట్టల మధ్య బొబ్బ లు ఏర్పడి మూడు నుంచి నాలుగు వారా ల్లో పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడి, పశువులు మేత తీసుకోక నీరసిస్తాయి. ఈ వ్యాధి నివారణకు ప్రభు త్వం ఏటా వ్యాధినిరోధక టీకాలు ముందస్తుగానే ఇస్తుంది. ఈ వ్యాధి నివారణకు నోట్లో ని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి. గిట్టల మధ్య పుండ్లకు పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె రాయలి. యాంటిబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వంటివి వ్యాధుల సూచన మేరకు వాడితే ఉపశమనం కులుగుతంది.