calender_icon.png 19 January, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటరైపోతారు జాగ్రత్త!

25-07-2024 01:37:56 AM

ప్రధాని మోదీపై తమిళనాడు సీఎం ఫైర్

చెన్నై, జూలై 24: కేంద్రబడ్జెట్‌లో తమిళనాడుపై ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఎన్నికల్లో ఓడించినవారిపై ప్రధాని మోదీ ప్రతీకారం తీర్చుకొంటున్నారని విమర్శించారు. బడ్జెట్‌పై స్టాలిన్ బుధవారం ట్వీట్ చేశారు. ‘ప్రధాని మోదీగారు.. ఎన్నికలు అయిపోయాయి.. ఇక మనమంతా దేశం అభివృద్ధిపై దృష్టిపెట్టాలని మీరు మొన్ననే అన్నారు.. అదేరోజు పార్లమెంటులో పెట్టిన బడ్జెట్‌లో దేశాన్ని రక్షించటానికి కాకుండా మీ ప్రభుత్వాన్ని రక్షించుకోవటానికే ప్రాధాన్యం ఇచ్చారు. వివక్ష వివక్ష చూపకుండా దేశాన్ని పాలించండి. మిమ్మల్ని ఓడించినవారిపై పగతీర్చుకోవాలన్న ఆలోచనను వదిలేయండి. మీరు ఇలాగే రాజకీయ ప్రాథమ్యాల కోసం, రాజకీయాల కోసం పనిచేస్తూ వెళ్తే చివరకు ఒంటరైపోతారు జాగ్రత్త’ అని స్టాలిన్ హెచ్చరించారు. పాలన ఎలా చేయాలో స్టాలిన్‌ను చూసి నేర్చుకోవాలని ప్రధానికి డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సూచించారు.