భారత కాన్సులేట్ హెచ్చరిక
అధికారిక ఈహీసేవా వెబ్‌సైట్ మాత్రమే ఉపయోగించాలని సూచన
న్యూయార్క్, ఆగస్టు 9: తప్పుడు ట్రావెల్ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. భారత సంతతికి చెందిన వ్యక్తుల నుంచి కాన్సులర్ సేవలకు అధిక మొత్తాల్లో చార్జీలు చెల్లిస్తున్నారని, అవసరానికి తగినట్లు తప్పుడు పత్రాలను సైతం సమర్పిస్తున్నారని తెలిపింది. ఓసీఐ కార్డు సేవలకు భారీగా వెచ్చిస్తున్నారని కాన్సుల్ జనరల్ బినాయి ప్రధాన్ కొన్ని అంశాలను ప్రస్తావించారు.
17 డాలర్లకు ఇవ్వాల్సిన ఎమర్జెన్సీ వెరిఫికేషన్‌కు 450 డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి సర్టిఫికెట్ల కోసం ఎలాంటి ఏజెంట్లను సంప్రదించాల్సిన అవసరం లేదని, నేరుగా కాన్సులేట్‌లో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులను వేగంగా ఆమోదించేందుకు గతంలో తప్పుడు బిల్లులు, ధ్రువీకరణలు, చిరుమానాలను సమర్పిస్తారని చెప్పారు. ఇలాంటి స్కాముల నుంచి తప్పించుకునేందుకు అధికారిక ఈpవీసా వెబ్‌సైట్‌ను మాత్రమే వాడాలని సూచించారు. ఇప్పటివరకు ఇలాంటి 140 తప్పుడు వెబ్‌సైట్లను గుర్తించామని తెలిపారు. కాగా, భారత కాన్సులేట్ ప్రమిత్, భారతీ చాట్‌బాట్, మొబైల్ యాప్ వంటి డిజిటల్ సేవలను కూడా ప్రారంభించింది.