calender_icon.png 30 September, 2024 | 10:06 AM

సైబర్ మోసగాళ్లతో అప్రమత్తం

29-09-2024 02:10:55 AM

సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): సైబర్ మోసగాళ్లతో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. ఇసాకా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘సెక్యూరింగ్ ది ఫ్యూచర్: నావిగేటింగ్ ది ఇంటర్ సెక్షన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ పేరుతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అవినాశ్ మహంతి మాట్లాడుతూ.. మనుషుల్లోని భయం, దురాశను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ ఏడాది మొత్తం నేరాల్లో 30 శాతం సైబర్ నేరాలే ఉన్నాయని, రాబోయే రోజుల్లో అది 50 శాతానికి చేరొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది బిలియన్ల విలువైన క్రైమ్ జరిగిందని, రికవరీ మాత్రం 20 శాతంలోపే ఉందన్నారు. దీనిపై ఐటీ, డేటా , పోలీస్ విభాగాలు, ఆడిటర్లు చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏఐ సిటీ కోసం ౨౦౦ ఎకరాలు కేటాయించిందని, ఏఐపై పనిచేసే సంస్థలకు సహక రిస్తామని చెప్పారు. ఇసాకా హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జీసీఎస్ శర్మ, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ జా యింట్ సెక్రటరీ నరేంద్రనాథ్, సీఈఆర్టీ డైరెక్టర్ ఎస్‌ఎస్ శర్మ, ఇసాకా ఫౌండేషన్ డైరెక్టర్ రఘు అయ్యర్, ప్రతినిధులు కృష్ణశాస్త్రి, వీరాధ, సునీల్‌కుమార్, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.