calender_icon.png 8 November, 2024 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాక్ మార్కెట్ పేరిట మోసం...

03-08-2024 03:50:49 PM

ప్రైవేట్ ఉద్యోగులనుంచి 3.81 కోట్లను దోచుకున్న సైబర్ నేరగాళ్లు

రెండు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు కేసులలో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల నుంచి   3.81 కోట్లు దోచుకున్నారంటూ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఏపీఆర్ లగ్జూరియాకి చెందిన ఓ ప్రవేటు ఉద్యోగి ఫేస్ బుక్లో  45 రోజుల కితం స్టాక్ మార్కెట్ పేరిట  ప్రకటన చూసి క్లిక్ చేశాడు. దీంతో అతడు సైబర్ నేరస్తులు పన్నిన మాయాజాలంలో భాగంగా వాట్సప్ గ్రూప్లో సభ్యుడిగా మారాడు. తదనంతరం పెట్టబడి పెట్టమని సూచించి ఒక నకిలీ పోర్టల్లో  లాభాలు వస్తున్నట్లుగా చూపించడం మొదలెట్టారు. ఇలా 22 దఫాలుగా సదరు బాధితుడి నుంచి  కేటుగాళ్లు 2.4 కోట్లు కైంకర్యం చేసినట్లు పటాంచెరు పోలీసులకు ఫిర్యాదు అందింది.

పోలీసు స్టేషన్ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

మరొక కేసులో యూట్యూబ్ లో స్టాక్ మార్కెట్ ప్రకటన చూసి క్లిక్ చేయడంతో మరో వ్యక్తి కూడా వాట్సప్ గ్రూప్లో సభ్యుడిగా మారాడు. నెల రోజులుగా రూ 66.75 లక్షలపెట్టుబడి పెట్టాడు.తనకు వచ్చిన లాభాలు తిరిగివ్వాలని కోరితే ఆ కేటుగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి అతడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.  ప్రస్తుతం ఈ రెండు కేసుల దర్యాప్తు కొనసాగుతోంది.