calender_icon.png 15 January, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరగాళ్లతో జర జాగ్రత్త!

18-07-2024 12:05:00 AM

నేను నా పని పూర్తి కాగానే సిస్టమ్ లాగౌట్ చేస్తా..

మీరు చేస్తున్నారా? సైబర్ భద్రత ఎంతో ముఖ్యం

న్యూఢిల్లీ, జూలై 17: ‘ సైబర్ నేరగాళ్లతో జర జాగ్రత్త. రోజు పని పూర్తయిన తర్వాత మీ సిస్టమ్స్ లాగౌట్ చేస్తారా? నేను చేస్తాను. సైబర్ భద్రత కోసం ప్రతిఒక్కరూ ఆ పని చేయాలి. ప్రతిరోజు పని పూర్తయిన తర్వాత సిస్టమ్స్ లాగౌట్ చేశామా? లేదా? అనేది కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అవసరమైతే ఆ పనిని ప్రతి కార్యాలయంలో ఓ వ్యక్తికి అప్పగించాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. న్యూఢిల్లీలో సీనియర్ బ్యూరోక్రాట్లతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సైబర్ నేరాలపై హెచ్చరించారు. క్యాబినేట్ సెక్రటరీ సైబర్ భద్రతపై రాతపూర్వకంగా బ్యూరోక్రాట్లకు ఆదేశాలు ఇచ్చారు. సైబర్ నేరాల సమస్యను ప్రధాని గతంలో నూ బహిరంగ సమావేశాల్లో అనేక సార్లు లేవనెత్తారు.

మార్చిలో మైక్రోసాఫ్ట్ అధినేతతో నిర్వహించిన ‘చాయ్ పే చర్చా’ లో నూ ‘సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు నేను ఇష్టపడతా. కొత్త విషయాలు నేర్చుకోవడమంటే నాకెంతో ఇష్టం.  ఏఐ శక్తివంత మైనదే. కానీ.. దాన్ని మ్యాజిక్ టూల్‌గా వినియోగిస్తే పర్యావసానాలు తీవ్రంగా ఉంటా యి. సరైన శిక్షణ తీసుకుని విచక్షణతో ఏఐని వినియోగించాలి. తప్పుడు మార్గంలో ఉన్న వారి చేతిలోకి అలాంటి సాంకేతికత వెళితే సమాజానికి చేటు’ అని  మోదీ అభిప్రాయపడ్డారు. సైబర్ సమస్యను అధిగమించడం కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఇలాంటి సందర్భంలో ప్రధాని మోదీ ప్రత్యేక చొరవ తీసుకుని సైబర్ నేరాలపై బ్యూరోక్రాట్లను అప్రమత్తత జాగృత పరచడంపై నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు.