calender_icon.png 4 March, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీలగిరి పర్వతశ్రేణుల మధ్య..

02-03-2025 12:00:00 AM

వేసవి కాలం ఫ్రెండ్స్‌తో.. ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బెస్ట్ ఆప్షన్ ఊటీ. ఊటీ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు. వేసవిలోనూ చల్లదనాన్నిపంచే ఈ అద్భుతమైన హిల్ స్టేషన్‌ను చూడటానికి అనేక రాష్ట్రాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. దేశంలోని బెస్ట్ టూరిస్ట్ హిల్ స్టేషన్స్‌లో ప్రముఖంగా చెప్పుకోదగ్గది ‘ఊటీ’. ఏడాది పొడవునా పర్యాటకులతో కిటకిటలాడే ఈ టూరిస్ట్ ప్యారడైజ్‌లో చూడదగ్గ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..  

ఊటీ వెళ్లేవారు తప్పకుండా చూడాల్సిన ప్రదే శం గవర్నమెంట్ రోజ్ గార్డెన్. పర్యాటకులకు ఇది ఒక మరపురాని అనుభూతి అందిస్తుం ది. ఊటీలోని విజయనగరంలో ఉన్న ఎల్క్ కొండపై ఈ ప్రదేశం ఉంది. దాదాపు 20 వేల రకాల రోజాలతో దేశంలోనే అతిపెద్ద రోజ్ గార్డెన్‌గా దీనికి ప్రాముఖ్యత ఉంది. కాలిబాటల్లో, గోడలపై, కూర్చునే ప్రదేశాల్లో ఇలా ఎక్కడ చూసినా రోజా లు కనిపిస్తాయి. రోజాల నుంచి వచ్చే సువాసనలు పర్యాటకులను మైమరపింపజేస్తాయి.

ఎంతో అందంగా తీర్చిదిద్దబడిన ఈ రోజ్ గార్డెన్‌లో అందరూ గంటల తరబడి గడుపుతుంటా రు. ముఖ్యంగా మహిళలు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లడానికి ఇష్టపడరు. తెల్లవారుజామున లేదా సాయంత్రం రోజ్ గార్డెన్‌ను సందర్శించేందుకు మంచి సమయం. ముఖ్యంగా జనవరి నుంచి మార్చి మాసాల మధ్య రోజ్ గార్డెన్ ఎంతో వైభవంగా కనిపిస్తుంది.

టాయ్ ట్రైన్‌లో: మెట్టుపాల్యం రైల్వే స్టేషన్ నుంచి ఊటీa వరకూ టాయ్ ట్రైన్ ద్వారా చేరుకోవడం ఒక చక్కని అనుభూతి. నీలగిరి పర్వతా లపై గుహలు, జలపాతాల నడుమ సాగే ఈ ప్ర యాణం ఎంతో హుషారుగా అనిపిస్తుంది. 1899 నుంచి ఈ టాయ్ ట్రైన్ పర్యాటకులకు ఎన్నో అందమైన అనుభవాలను పంచుతుంది. ఆవిరితో ఇప్పటికీ నడుస్తున్న ఈ చిన్న రైలులో ప్రయాణించేందుకు టూరిస్టులు ఎంతో ఆసక్తి చూపుతారు.

ఎకో రాక్: సహజమైన ప్రకృతి అందాలతో కూడిన అద్భుతమైన ప్రదేశం ఎకో రాక్. ఇది కూనూర్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉం టుంది. దీనిని ‘లంబ్స్ రాక్’ అని పిలుస్తారు. ఇక్క డి నుంచి కనిపించే దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎకో రాక్ నుంచి విస్తారమైన అడవుల మధ్య కోయంబత్తూర్ కూడా కనిపిస్తుంది. ఈ ప్రదేశం పర్యాటకులకు ఎంతో ఇష్టమైనది అయినప్పటికీ అధిక రద్దీ మాత్రం ఉండదు. ఇక్కడి నుం చి కుడి వైపు హులికల్ లోయలో ఉన్న కూనూర్ నది మరో అద్భుతమైన ప్రాంతం.

దొడ్డబెట్ట: నీలగిరి పర్వతాల్లో అత్యంత ఎత్తున ప్రదేశం దొడ్డబెట్ట. ఊటీలో చూడాల్సిన మనోహరమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఊటీకు తొమ్మది కిలోమీటర్ల దూరంలో 2,637 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశం ట్రెక్కింగ్‌కు అద్భుతంగా ఉంటుంది. దొడ్డబెట్ట చుట్టూ దట్టమైన అడవు లు, అందమైన, ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఇక్కడి ఎత్తు నుంచి చూస్తే కనుచూపు మేర విస్తారంగా పరచుకుని ఉండే నీలగిరి పర్వత శ్రేణులు, మధ్యలో అనేక గ్రామాలు, మబ్బుల గుంపులు టూరిస్టులను కట్టిపడేస్తాయి. ఇక్కడ ఒక టెలిస్కోప్ అబ్జర్వేటరీ కూడా ఉంటుంది. ఇందులో టెలిస్కోప్ ద్వారా పర్వతాలను, దాని చుట్టూ ఉండే ప్రదేశాలను సులభంగా, స్పష్టంగా గుర్తించవచ్చు.