calender_icon.png 3 April, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్ ఆన్‌లైన్ గేమ్‌కు దూరంగా ఉండాలి

02-04-2025 12:43:32 AM

జిల్లా ఎస్పీ డి జానకి

మహబూబ్ నగర్ ఏప్రిల్ 1 (విజయ క్రాంతి) : బెట్టింగ్ మరియు ఆన్లైన్ గేమింగ్కి దూరంగా  ఉండాలని జిల్లా ఎస్పీ  డి. జానకి అన్నారు. యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత గేమింగ్ ప్లాట్ఫారమ్స్, ఐపీఎల్ బెట్టింగ్లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.

తక్కువ సమయంలో పెద్ద మొత్తం సంపాదించాలనే ఆకాంక్షతో, యువత ఈ అక్రమ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా మారి, ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారు ఆన్లైన్లో చేసే కార్యకలాపాలను గమనించాలని సూచించారు. రోజూ వారి ఆచరణను గమనిస్తూ, అవసరమైన సందర్భాల్లో మార్గనిర్దేశం చేయాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏవైనా బెట్టింగ్ కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందించాలని, అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ  తెలిపారు.