calender_icon.png 2 November, 2024 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్లైన్ బెట్టింగ్... 33.10 లక్షల నగదు స్వాధీనం

05-07-2024 08:11:29 PM

సుల్తానాబాద్ : పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన రూ.33.10 లక్షల నగదును తరలిస్తున్న ముగ్గరు యువకులను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నారని పక్క సమాచారంతో ఎస్ఐలు శ్రావణ్ కుమార్, నరేష్ ల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎంహెచ్ 01 ఏవీ 1377 గల వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనం ఆపి అందులో ఉన్న ముగ్గురు యువకులను ప్రశ్నించారు.

వారి నుండి సరైన సమాధానం రాకపోవడంతో వాహనాన్ని తనిఖీ చేసి అందులో ఉన్న ఒక బ్యాగ్ ను తేర్చి చూడగా.. అధిక మొత్తంలో డబ్బులు కనిపించాయి. సుమారుగా 33 లక్షలు ఉన్నాట్లుగా అధికారులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నుంచి వచ్చిన యూఎస్ డాలర్లను హైదరాబాద్ లో ఇండియన్ కరెన్సీలోకి మార్చుకొని వచ్చినట్లు నిందితులు వెల్లడించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు రామగూండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్, ఐపీఎస్, ఐజీ తెలిపారు. పట్టుబడిన నిందితులను 1. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిమ్మ ధనుంజయ్, 2. గోదావరిఖనికి చెందిన ముల్కల రాజ్ కుమార్, 3.గోదావరిఖనికి చెందిన చిన్న పల్లి అభిలాష్ గా గుర్తించారు.