calender_icon.png 20 April, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంటెక్ విద్యార్థిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్

18-04-2025 12:26:09 AM

అప్పుల బాధతో మనస్తాపం.. ఉరేసుకొని బలవన్మరణం

రాజేంద్రనగర్, ఏప్రిల్17: బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టిన ఓ యువకుడు అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో మనోవేదనకు గురై ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల ప్రాంతానికి చెందిన పెద్ద నర్సింలు కొడుకు పవన్ మాసాబ్ ట్యాంక్లో ఎంటెక్ చదువుతూ తన స్నేహితులు ఎన్.గౌతమ్, రోహిత్తో కలిసి అత్తాపూర్ లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

ఇటీవల పవన్ తండ్రికి ఫోన్ చేసి బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు కావాలని కోరడంతో పలుమార్లు యూపి ఐ ద్వారా 98,200 బదిలీ చేశాడు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి 7 గంటలకు పెద్ద నర్సింలు   మేనల్లుడు శ్రీకాంత్ ఫోన్ చేసి పవన్ అత్తాపూర్లోని అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలియజేశాడు. వెంటనే పెద్ద నర్సింలు హుటాహుటిన అత్తాపూర్ వచ్చాడు.

పవన్ బెట్టింగ్ కోసం తన ఐఫోన్ 15, రాయల్ ఎన్ఫీల్ థండర్బర్డ్ 350 సీసీ విక్రయించినట్లు గుర్తించాడు. దీంతోపాటు ఇంటి వద్ద నుంచి కూడా కొన్ని డబ్బులు తెచ్చుకున్నాడు. బెట్టింగ్ లో తీవ్రంగా నష్టపోవడంతో చేసేది ఏమీ లేక పవన్ బుధవారం రాత్రి అద్దె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు కేసు దర్యాప్తులో ఉంది.