రాష్ట్రంలో పలు చోట్ల మినీ బస్సు డిపోలు ఏర్పాటు చేయవలసిన అవసరం చాలా కనిపిస్తున్నది. వీటివల్ల బస్సులకు ఏమైనా మరమ్మతులు అవసరమైతే ఆయా ప్రాంతాలలో ఆలస్యం జరక్కుండా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. టిక్కెట్లు ఇచ్చే యంత్రాలకు సాంకేతిక సమస్యలు వచ్చినా అందుబాటులో పరిష్కరించుకోవచ్చు. చాలావరకు ఇప్పుడున్న డిపోలు ఎంతో దూరంగా ఉన్నాయి.
దీనివల్ల బస్సులకు ఇంధనం నింపుకోవడమూ అప్పుడప్పుడు సమస్యగా మారుతుంది. మినీ బస్ డిపోలవల్ల మరిన్ని కొత్త రూట్లకు బస్సులు నడిపే అవకాశం కూడా ఉంటుంది. అలాగే, రాత్రి వేళ గ్రామాలకు ఎక్కువ సమయం పాటు బస్సులు నడపవచ్చు. ఆర్టీసీ ఉన్నతాధికారులు కావలసిన మేరకు సర్వే చేసి, అవసరమైన చోట్ల పలు మినీ బస్ డిపోలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్