calender_icon.png 13 January, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందాలి

13-01-2025 12:28:22 AM

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జనవరి 12 (విజయ క్రాంతి) : వైద్య శాఖకు సంబం దించిన అన్ని అంశాలలో వంద శాతం పురోగతి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆది వారం. క్షేత్రస్థాయి పర్యటన లో భాగంగా కలెక్టర్ మెదక్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, మాతా శిశు సంరక్షణ కేంద్రంను ఆకస్మికంగా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్బంగా ముందుగా సిబ్బంది హాజరు పట్టికలు, మందుల స్టాక్ రిజిస్టర్, ఓపి రిజిస్టర్‌ను పరిశీలించిన అనంతరం కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో అన్ని సబ్  సెంటర్, పీహెచ్సీ, జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన  వైద్య సేవలు అందించాలన్నారు.

పీహెచ్సీల వైద్య అధికారులతో, ఏఎన్‌ఎం, ఆశలతో ఓపీ, గర్భిణీ నమోదు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే   సాధారణ ప్రసవాలు  జరగాలని ప్రైవేటు  ఆసుపత్రిలో అధిక సంఖ్యలో సి సెక్షన్ జరుగుతున్నాయని దీని మీద వైద్యశాఖ అధికారులు  దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.