20-04-2025 12:04:37 AM
ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, టిఫా సేవల్లో మెరుగు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్స్ (టీ వైద్య పరీక్షలు గతంతో పోలిస్తే మరింత మెరుగయ్యాయి. గిరిజన ప్రాంతాలకు సైతం టీ హబ్ సేవలు విస్తరిస్తున్నాయి. అనేక గ్రామీణ ప్రాంతాల్లోనూ శాం పిల్స్ తీసుకొని వారి రిపోర్టులను పరిశీలిం చి వైద్యం అందిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వైద్య పరీక్షల సేవలు పెద్ద ఎత్తున పెరిగాయి. 2023 నెలకు సగటున 2,89,475 మందికి సేవలు అందించగా, 2024- సగటున నెలకు 3,24,982 మందికి సేవలందిం చారు.
2023 నెలకు సగటున 10,82,537 పరీక్షలు చేస్తే, 2024 నెలకు సగటున 11,19,900 పరీక్షలు చేశారు. టీ హబ్స్‌లో 2023 13,233 మంది ఎక్స్‌రే తీ యించుకోగా, 2024- 15,929 మంది ఎక్స్‌రే సేవలు వినియోగించుకున్నా రు. ఈసీ జీ, ఆల్ట్రాసౌండ్, టిఫా, మామో గ్రామ్ వంటి అన్ని రకాల సేవల్లోనూ 2023 కంటే, 2024 మెరుగైన సేవలు అం దాయి. 92 శాతం మంది రోగులకు శాంపిల్ ఇచ్చిన రోజే రిపోర్ట్ ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు.
కొత్తగా టీ హబ్స్
ఉట్నూరులో గతేడాది టీ హబ్ ఏర్పాటు చేశామని.. భద్రాచలం, ఏటూరు నాగారం, మన్ననూరు వంటి గిరిజన ప్రాంతాలకు సేవలను విస్తరించి హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నారాయణపేట్, మేడ్చల్ మల్కాజ్‌గిరిలోనూ కొత్త డయాగ్నస్టిక్స్ హబ్స్ ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. హబ్స్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరణ కోసం 174 సోక్స్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.